Credit Score: లోన్ రావట్లేదా.. ఈ టిప్స్ పాటిస్తే 12నెలల్లోనే మీ క్రెడిట్ స్కోర్ అదిరిపోతుంది

Credit Score: లోన్ కోసం ట్రై చేస్తున్నారా ? కానీ లోన్ రావట్లేదా? అందుకు ప్రధాన కారణం మీ క్రెడిట్ స్కోర్ అయ్యుండొచ్చు. అప్పు తీసుకునే వారికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేది దీని ఆధారంగానే.

Update: 2025-06-28 03:30 GMT

Credit Score: లోన్ రావట్లేదా.. ఈ టిప్స్ పాటిస్తే 12నెలల్లోనే మీ క్రెడిట్ స్కోర్ అదిరిపోతుంది

Credit Score: లోన్ కోసం ట్రై చేస్తున్నారా ? కానీ లోన్ రావట్లేదా? అందుకు ప్రధాన కారణం మీ క్రెడిట్ స్కోర్ అయ్యుండొచ్చు. అప్పు తీసుకునే వారికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేది దీని ఆధారంగానే. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారు కొన్ని పద్ధతులు పాటించి దానిని మెరుగుపరుచుకోవచ్చు. దీనివల్ల తక్కువ వడ్డీ రేట్లతో, త్వరగా లోన్ పొందేందుకు అర్హులు అవుతారు. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడం ఒక దీర్ఘకాల ప్రక్రియ కాబట్టి, ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. అలా చేస్తే ఏడాది చివరికల్లా మంచి ఫలితాలు పొందవచ్చు.

క్రెడిట్ స్కోర్ మెరుగుపరచడానికి ఏం చేయాలి?

రిపోర్ట్‌లో తప్పులను సరిదిద్దండి

ముందుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను జాగ్రత్తగా చూడండి. అందులో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని సరిచేయించుకోండి. ఉదాహరణకు, మీరు ఇప్పటికే చెల్లించిన ఏదైనా బకాయి ఇంకా అప్పుగా చూపిస్తుంటే. అలాంటి వాటిని సరిదిద్దించుకోవాలి.

క్రెడిట్‌ను తక్కువగా ఉపయోగించండి

మీరు మీ క్రెడిట్ లిమిట్‌ను 30% కంటే ఎక్కువగా ఉపయోగించకుండా చూసుకోవాలి. ఉదాహరణకు, మీ మొత్తం క్రెడిట్ లిమిట్ రూ.20 లక్షలు అయితే, రూ.6 లక్షలకు మించి ఉపయోగించకుండా చూసుకోండి. మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కూడా ఉపయోగించవచ్చు.

వివిధ రకాల లోన్‌లు కలిగి ఉండండి

క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి మీ వద్ద క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి వివిధ రకాల అప్పులు ఉండాలి. అయితే, అవసరం లేని లోన్ లేదా కార్డ్‌ను కేవలం స్కోర్ పెంచుకోవడం కోసం తీసుకోకండి. కానీ, మీరు ఉపయోగించనంతవరకు ఎటువంటి ఖర్చు లేని క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవచ్చు.

సమయానికి పేమెంట్స్ చేయండి

మీ అన్ని బిల్లులు, లోన్ కిస్తీలు సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. మీరు ఒక్కసారి కూడా చెల్లింపులో ఆలస్యం చేస్తే, మీ స్కోర్ గణనీయంగా పడిపోవచ్చు.

పాత కార్డులను క్లోజ్ చేయవద్దు

మీకు ఏవైనా పాత క్రెడిట్ కార్డులు ఉంటే, వాటిని క్లోజ్ చేయవద్దు. పాత కార్డులు మీ క్రెడిట్ హిస్టరీని లాంగ్ రన్ లో చూపిస్తాయి, ఇది క్రెడిట్ స్కోర్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ లోన్ సులభంగా ఆమోదించబడాలంటే, తక్కువ వడ్డీ రేటుతో పొందాలంటే, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడంపై ఇప్పుడే పని చేయడం ప్రారంభించండి. ఓపిక, క్రమబద్ధత ఉంటే ఖచ్చితంగా మెరుగుదల ఉంటుంది.

Tags:    

Similar News