Income Tax: ఇక నుంచి మీ వాట్సాప్, ఈ మెయిల్స్‌ చెక్ చేసే అధికారం ఇన్కమ్ ట్యాక్‌కి రావచ్చు.. జర ముందే చూసుకోండి మరి..

Income Tax: ఆదాయపు పన్ను శాఖ త్వరలో కొత్త నిబంధనలు తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఒక కొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

Update: 2025-07-23 09:47 GMT

Income Tax: ఇక నుంచి మీ వాట్సాప్, ఈ మెయిల్స్‌ చెక్ చేసే అధికారం ఇన్కమ్ ట్యాక్‌కి రావచ్చు.. జర ముందే చూసుకోండి మరి..

Income Tax: ఆదాయపు పన్ను శాఖ త్వరలో కొత్త నిబంధనలు తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఒక కొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం చూస్తే.. మీ వాట్సాప్, ఈమెయిల్స్ , క్లౌడ్ స్టోరేజ్ వంటి సోషల్ మీడియాలను యాక్సెస్ చేసే అధికారం ఇక ఇన్కమ్ టాక్స్‌కు ఉంటుంది. లోక్ సభ సెలెక్ట్ కమిటీ ఈ బిల్లను సమర్ధించడం విశేషం. బిల్లులో ఉన్న నిబంధనలు ఏంటో చూద్దాం.

కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆదాయపు పన్ను శాఖ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పన్ను అధికారులు మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ వంటి డిజిటల్ డేటాను చూడగలుగుతారు. మీరు పాస్ వర్డ్‌లు ఇవ్వకపోయినా చూపే అధికారం ఇన్కమ్ టాక్స్‌కు ఉంటుంది. ఇప్పటికే సెలెక్ట్ కమిటీ దీన్ని సమర్ధించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త బిల్లులో ఇన్ కంట్యాక్స్ అధికారులకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఖాతాలు, ఈమెయిల్స్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఇతర డిజిటల్ ప్రాపర్టీలను యాక్సెస్ చేయడానికి అనుమతించేలా ఈ కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ లోక్ సభ సెలెక్ట్ కమిటీ దీన్ని సమర్ధించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే దీన్ని మరింత పరిశీలించి మార్పులు చేసేందుకు 31 మంది పార్లమెంట్ సభ్యులతో కూడిన సెలెక్ట్ ప్యానెల్‌కు పంపారు. అయితే ఇక్కడ ఈ కొత్త బిల్ లో కొంతైనా సవరణ జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే బిల్లు ప్రకారం కీలక నిబంధనలు ఏంటంటే.. ఒక వ్యక్తి ఏదైనా డాక్యుమెంట్, రికార్డ్ లేదా సమాచారాన్ని డిజిటల్ రూపంలో కలిగి ఉంటే అతను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అవన్నీ సమర్పించాలి. అంటే పూర్తిగా అధికారులకు సహకరించాలి. అదేవిధంగా ... కంప్యూటర్ సిస్టమ్, డివైజ్, క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న సమాచారాన్ని పొందడానికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్‌కు అవసరమైన పాస్ వర్డ్‌లు, లాగిన్, యాక్సిస్ అధికారాలు ఇవ్వాలి. ఒకవేళ ఇవేమీ వారికి ఇవ్వకపోతే దానిని బలవంతంగా బ్రేక్ చేసే వర్చువల్ డిజిటల్ స్పేస్‌ను అధికారి యాక్సెస్ చేయొచ్చు.

Tags:    

Similar News