Food Delivery: ఈ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. జొమాటో, స్విగ్గీల కంటే 60 శాతం తక్కువ ధరకే.. బిల్లు పోల్చి చూస్తే.. నమ్మలేరంతే..!

Food Delivery Apps: ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే అందరి ఫోన్‌లో ఫుడ్ డెలివరీ యాప్స్ Zomato, Swiggy యాప్‌లు ఉంటూనే ఉంటాయి.

Update: 2023-05-09 08:39 GMT

Food Delivery: ఈ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. జొమాటో, స్విగ్గీల కంటే 60 శాతం తక్కువ ధరకే.. బిల్లు పోల్చి చూస్తే.. నమ్మలేరంతే..!

Zomato Vs Swiggy: ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే అందరి ఫోన్‌లో ఫుడ్ డెలివరీ యాప్స్ Zomato, Swiggy యాప్‌లు ఉంటూనే ఉంటాయి. ఈ యాప్‌ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఈ రెండూ కంపెనీలు ఓపెన్ నెట్‌వర్క్ అంటే ONDC నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రెస్టారెంట్ యజమానులు నేరుగా కస్టమర్‌లకు ఆహారాన్ని విక్రయించే వేదికగా ఇది ఎంతో పేరుగాంచింది. దీని కోసం థర్డ్ పార్టీ లేదా ఫుడ్ అగ్రిగేటర్ Swiggy లేదా Zomatoతో అస్సలు పని లేదు. ఇక్కడ వినియోగదారులకు తక్కువ ధరకే ఆహారం లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్లాట్‌ఫామ్ గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి.

ONDC గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. కానీ ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ తక్కువ ఖర్చుతో, ఇప్పుడు ప్రజలలో చాలా ఫేమస్ అవుతోంది. చాలా మంది వ్యక్తులు సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో Jomato-Swiggy నుంచి ఆర్డర్ చేసిన ఆహార ధరను ONDC నుంచి వచ్చిన బిల్లులతో పోల్చి చూస్తున్నారు.

ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) లక్ష్యం ఇ-కామర్స్ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడమేనంట. ఇది ఏప్రిల్ 2022లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రతిరోజూ 10, 000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు డెలివరీ అవుతున్నాయి. దేశంలోని దాదాపు 240 నగరాల్లో ONDC సేవలు అందుబాటులో ఉన్నాయి.

బిల్లుల పోలిక..

వినియోగదారులు ఇప్పుడు ONDC ఆహార బిల్లును Zomato లేదా Swiggy బిల్లులతో పోల్చి చూస్తున్నారు. వాటి రేట్లలో 60 శాతం వరకు వ్యత్యాసం ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు. వినియోగదారులు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి బర్గర్‌లు, శీతల పానీయాలను ఆర్డర్ చేసి, ఆపై ఆ బిల్లుల స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. దీని ప్రకారం స్విగ్గీపై వచ్చిన బిల్లు రూ.337లు ఉండగా, అదే ఫుడ్ ఓఎన్‌డీసీలో రూ.185.57లకు వస్తోంది.

ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..

ONDC సేవలను Paytm యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. యాప్‌ను ఓపెన్ చేసి ONDC అని టైప్ చేయాలి. అప్పుడు మీరు కిరాణా, ఫుడ్ ఎంపికలను కొనుగొంటారు. వీటిని క్లిక్ చేయడం ద్వారా మీరు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.


Tags:    

Similar News