India's Richest Man: గౌతమ్ అదానీని దాటేసిన ముఖేశ్ అంబానీ...
India Richest Man: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు.
India’s Richest Man: గౌతమ్ అదానీని దాటేసిన ముఖేశ్ అంబానీ...
India Richest Man: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. బ్లూమ్‌బర్గ్ ధనవంతుల జాబితా ప్రకారం అంబానీ సంపద 359 కోట్ల డాలర్లు పెరగడంతో మరో ధనవంతుడు అదానీని దాటేశారు. అదానీ సంపద 296 కోట్ల డాలర్లతో ఆసియా ధనవంతుల్లో రెండో స్థానంలో నిలిచారు. వారం రోజులగా ఆర్‌ఐఎల్ షేర్లు దూసుకెళ్లడంతో పాటు.. తాజాగా మూడు శాతం షేర్ల ధరలు పెరుగుదలతో అంబానీ ఆదాయం పెరిగింది. అంబానీ నికర విలువ 9వేల 970 కోట్ల డాలర్లగా నమోదైనట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇక అదానీ నికర విలువ 9వేల 870 కోట్ల డాలర్లుగా నమోదయ్యింది.