August Holidays 2023: ఆగష్ట్‌లో సెలవులకి కొదవలేదు.. టూర్ ప్లాన్ చేస్తే బెటర్..!
August Holidays 2023: ఆగష్ట్ నెల వచ్చిందంటే చాలు పండుగలు, సెలవులు వరుసగా వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా సెలవుదినాలు ఉన్నాయి.
August Holidays 2023: ఆగష్ట్‌లో సెలవులకి కొదవలేదు.. టూర్ ప్లాన్ చేస్తే బెటర్..!
August Holidays 2023: ఆగష్ట్ నెల వచ్చిందంటే చాలు పండుగలు, సెలవులు వరుసగా వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా సెలవుదినాలు ఉన్నాయి. మంచిగా ప్లాన్ చేసుకుంటే దాదాపు పదిరోజుల సెలవులు పొందవచ్చు. ఉద్యోగులు, విద్యార్థులు నచ్చిన టూర్ ప్లాన్ చేసుకొని కొన్ని రోజులు పని నుంచి విశ్రాంతి పొందవచ్చు. చాలామంది సంతోషించే విషయం ఏంటంటే ఈ సంవత్సరం చాలా సెలవు దినాలు ఆదివారం రావట్లేదు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా వారాంతపు సెలవులు వచ్చాయి. ఉద్యోగులు వీటిని గొప్పగా వాడుకున్నారు. స్నేహితులు, ఫ్యామిలీలతో కలిసి విహారయాత్రలు చేశారు. ఒకవేళ అప్పుడు లాంగ్ వీకెండ్ మిస్ అయితే ఏం బాధపడవద్దు. ఇప్పుడు ఆ అవకాశం మళ్లీ వచ్చింది. ఆగష్టు నెలలో చాలా వారాంతపు సెలవులు వస్తున్నాయి. ప్లాన్ చేసుకుంటే పది సెలవులను పొందవచ్చు. టూర్ వెళ్లాలనుకుంటే సెలవులతో అనుసంధానం అయి ఉన్న వారాంతాలు, సెలవులని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అందుకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం.
ఆగస్ట్ 2023లో సెలవులు
1) ఆగస్టు 12, శనివారం (వారాంతపు సెలవు)
2. ఆగస్టు 13, ఆదివారం (వారాంతపు సెలవు)
3. ఆగష్టు 15, మంగళవారం: స్వాతంత్య్ర దినోత్సవం (జాతీయ సెలవుదినం)
4. ఆగష్టు 16, బుధవారం: పార్సీ నూతన సంవత్సరం (కొన్ని రాష్ట్రాలలో సెలవుదినం)
5. ఆగస్టు 26, శనివారం (వారాంతపు సెలవు)
6. ఆగస్టు 27, ఆదివారం (వారాంతపు సెలవు)
7. ఆగస్టు 29, మంగళవారం: ఓనం (ప్రాంతీయ సెలవు దినం)
8. ఆగస్టు 30, బుధవారం: రక్షా బంధన్ (సెలవు)