తక్కువ సమయంలో ఎక్కువ రాబడి.. ఉత్తమ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్..!

Investment Plans: ఈ రోజుల్లో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలని ప్రయత్నిస్తారు.

Update: 2022-09-21 09:37 GMT

తక్కువ సమయంలో ఎక్కువ రాబడి.. ఉత్తమ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్..!

Investment Plans: ఈ రోజుల్లో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలని ప్రయత్నిస్తారు. దీనికోసం అనువైన పెట్టుబడి ఎంపికల కోసం వెతుకుతుంటారు. కొన్నిసార్లు తెలిసి, తెలియని స్కీంలలో పెట్టుబడి పెట్టి సర్వం కోల్పోతారు. కానీ మీరు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే ప్రభుత్వ ఆమోదిత స్కీంలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. 100 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ స్కీంలని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ. మీరు స్టాక్ మార్కెట్‌లోనే కాకుండా బంగారం, వస్తువులలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

2. మీరు ఐదు సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే దాని కోసం చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు స్వల్ప కాల వ్యవధి కోసం డెట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్‌లను ఎంచుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలికంగా మంచివి.

3. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక మంచి పెట్టుబడి ఎంపిక. మీరు ఉద్యోగి అయితే తప్పనిసరిగా జీతంలో కొంత భాగాన్ని ఈపీఎఫ్‌ఓకు జమ చేయాలి. మీరు డిపాజిట్ చేసిన మొత్తం ఎంతో అంతే సహకారం కంపెనీ ఇస్తుంది. EPFO మొత్తంపై ప్రతి సంవత్సరం వడ్డీ లభిస్తుంది.

4. పెట్టుబడికి బంగారం కూడా నమ్మదగిన ఎంపిక. గోల్డ్ ఇటిఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు, డిజిటల్ గోల్డ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.

5. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) కూడా మంచి పెట్టుబడి ఎంపిక. సురక్షితమైన పెట్టుబడితో కూడిన ఈ ప్లాన్‌లో మీరు ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందుతారు. ఇందులో రూ.1500 నుంచి రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

6. PPF అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసులో PPF ఖాతాను తెరవవచ్చు. ఇది 15 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు.

Tags:    

Similar News