మేనెలలో బ్యాంకులకు రెండో శనివారం, ఆదివారం తప్పిస్తే రెండు సెలవులు ఉన్నాయి. ఈరోజు (మే 1) మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇక ఈ నెలలో 9 వతేదీ, 23వ తేదీ రెండో శనివారం సెలవులు ఉన్నాయి. అదేవిధంగా 3, 10, 17, 24, 31 తేదీలు మొత్తం ఐదు రోజులు ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. ఇక ఒకటో తేదీ మేడే ఒక్కటే అదనపు సెలవు రోజు. ఇది కాకుండా 24 వ తేదీ రంజాన్ సందర్భంగా సెలవు ఉండే అవకాశం ఉంది. దీంతో మొత్తమ్మీద మే నెలలో 9 రోజులు బ్యాంకులు పనిచేయవు.
అందరికీ నిత్యం బ్యాంకులతో ఎదో ఒక పని ఉంటుంది. ఈ సెలవు రోజులను బట్టి తమ తమ పనులను షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే, బ్యాంక్ సెలవులు ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానంలో లావాదేవీలకు ఆటంకాలు ఉండవు.