LIC: పాలసీ ల్యాప్స్ అయ్యిందా? ఎల్ఐసీ అదిరిపోయే ఛాన్స్.. భారీ డిస్కౌంట్‌తో మళ్లీ యాక్టివేట్ చేసుకోండి!

LIC Special Revival Campaign 2026: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు బంపర్ ఆఫర్! ఆగిపోయిన పాలసీలను మళ్లీ ప్రారంభించుకునేందుకు 'స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్' ప్రారంభం. లేట్ ఫీజుపై భారీ రాయితీలు.

Update: 2026-01-04 06:30 GMT

LIC: పాలసీ ల్యాప్స్ అయ్యిందా? ఎల్ఐసీ అదిరిపోయే ఛాన్స్.. భారీ డిస్కౌంట్‌తో మళ్లీ యాక్టివేట్ చేసుకోండి!

LIC Special Revival Campaign 2026: ఎల్ఐసీ (LIC) పాలసీ తీసుకుని, మధ్యలో ప్రీమియం చెల్లించలేక పాలసీలు నిలిచిపోయిన వారికి ఇది నిజంగా శుభవార్తే. వివిధ కారణాల వల్ల రద్దైన (Lapsed) పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఎల్ఐసీ 'స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది.

ముఖ్యమైన తేదీలు:

ప్రారంభం: జనవరి 1, 2026

ముగింపు: మార్చి 2, 2026 ఈ రెండు నెలల కాలంలో పాలసీదారులు తమ పాత పాలసీలను తక్కువ పెనాల్టీతో మళ్లీ ప్రారంభించుకోవచ్చు.

ఆలస్య రుసుము (Late Fee)పై రాయితీలు:

అర్హత కలిగిన అన్ని నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ఆలస్య రుసుముపై ఎల్ఐసీ ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటిచింది:

సాధారణ పాలసీలు: లేట్ ఫీజులో 30 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అయితే ఈ రాయితీ గరిష్ఠంగా రూ. 5,000 కు మాత్రమే పరిమితం.

మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు: అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన ఈ పాలసీలకు 100 శాతం జరిమానా మినహాయింపు ఇచ్చారు. అంటే ఎటువంటి అదనపు రుసుము లేకుండా కేవలం ప్రీమియం కట్టి పాలసీని పునరుద్ధరించుకోవచ్చు.

అర్హత నిబంధనలు:

♦ మొదటిసారి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ నుంచి ఐదేళ్ల లోపు ఉన్న పాలసీలను మాత్రమే ఈ క్యాంపెయిన్ కింద పునరుద్ధరించుకోవచ్చు.

♦ ప్రీమియం చెల్లింపు కాల పరిమితి ముగియని పాలసీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

♦ పాలసీ నిబంధనల మేరకు అవసరమైతే హెల్త్ రిపోర్ట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుపై ఎలాంటి రాయితీ ఉండదు.

పాత పాలసీని ఎందుకు పునరుద్ధరించుకోవాలి?

కొత్త పాలసీ తీసుకోవడం కంటే పాత దానిని పునరుద్ధరించుకోవడమే లాభదాయకం. ఎందుకంటే:

తక్కువ ప్రీమియం: వయసు పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది. పాత పాలసీని కొనసాగిస్తే పాత రేటుకే బీమా లభిస్తుంది.

బోనస్ ప్రయోజనాలు: గతంలో పాలసీకి జమ అయిన బోనస్‌లు వృథా కాకుండా ఉంటాయి.

ఆర్థిక భరోసా: అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబానికి లభించే పూర్తి ఆర్థిక రక్షణ తిరిగి అందుబాటులోకి వస్తుంది.

మీ పాలసీ ఆగిపోయి ఉంటే, వెంటనే మీ సమీప ఎల్ఐసీ కార్యాలయం లేదా ఏజెంట్‌ను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Tags:    

Similar News