LIC Policy: ఎల్‌ఐసీ బంపర్ స్కీమ్‌.. 40 ఏళ్ల నుంచే పెన్షన్‌ పొందవచ్చు..!

LIC Policy: మీరు 40 సంవత్సరాల వయస్సులోనే పెన్షన్ పొందాలంటే ఎల్‌ఐసీ అందించే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే చాలు.

Update: 2022-04-22 07:57 GMT

LIC Policy: ఎల్‌ఐసీ బంపర్ స్కీమ్‌.. 40 ఏళ్ల నుంచే పెన్షన్‌ పొందవచ్చు..!

LIC Policy: మీరు 40 సంవత్సరాల వయస్సులోనే పెన్షన్ పొందాలంటే ఎల్‌ఐసీ అందించే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే చాలు. ఈ పథకం పేరు సరళ పెన్షన్ యోజన. ఈ పాలసీ తీసుకునే సమయంలో వన్ టైమ్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీరు జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. పాలసీదారు మరణించిన తర్వాత నామినీకి సింగిల్ ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ఈ ప్లాన్‌ను జీవిత భాగస్వామితో కూడా తీసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. సరల్ పెన్షన్ స్కీమ్ కింద రెండు రకాల పెన్షన్ ఎంపికలు ఉంటాయి.

సింగిల్ లైఫ్: ఇందులో పాలసీ ఎవరి పేరుపైనా ఉంటుందో వారు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ పొందుతాడు. అతడి మరణం తర్వాత బేస్ ప్రీమియం మొత్తం నామినీకి తిరిగి చెల్లిస్తారు.

ఉమ్మడి లైఫ్: ఇందులో భార్యాభర్తలిద్దరికీ కవరేజీ ఉంటుంది. మొదట ప్రీమియం తీసుకున్న వ్యక్తి పెన్షన్ పొందుతాడు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత అతడి జీవిత భాగస్వామి పెన్షన్ పొందడం కొనసాగుతుంది. ఇద్దరు మరణించాక బేస్ ప్రీమియం మొత్తం నామినీకి అందుతుంది.

పింఛను ఎంత కాలానికి తీసుకోవాలో పెన్షనర్ నిర్ణయించుకోవాలి. ఇందులో మీకు 4 ఆప్షన్లు లభిస్తాయి. ప్రతి నెలా, ప్రతి మూడు నెలలకోసారి, ప్రతి 6 నెలలకోసారి పెన్షన్ తీసుకోవచ్చు లేదా 12 నెలల్లో తీసుకోవచ్చు. మీరు ఏ ఎంపికను ఎంచుకున్నా ఆ సమయంలో మీ పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. ఈ సాధారణ పెన్షన్ స్కీమ్ కోసం మీరు ఎంత డబ్బు చెల్లించాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అప్పుడు దానిని కూడా మీరే ఎంచుకోవలసి ఉంటుంది. అంటే మీరు ఎంచుకున్న పింఛను మొత్తం, ప్రకారం పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ప్రతి నెలా పింఛను కనీసం రూ.1000, మూడు నెలలకు రూ.3000, 6 నెలలకు రూ.6000, 12 నెలలకు రూ.12000 చెల్లించాలి. అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకోరాదని గమనించండి. 

Tags:    

Similar News