LIC Policy: ఈ స్కీంలో ప్రతిరోజు రూ.70 పొదుపు చేస్తే రూ.48 లక్షలు మీ సొంతం..!

LIC Policy: భవిష్యత్తు గురించి ముందుగానే ప్లాన్ చేసుకునే వ్యక్తిని తెలివైన వ్యక్తి అంటారు.

Update: 2022-12-17 09:08 GMT

LIC Policy: ఈ స్కీంలో ప్రతిరోజు రూ.70 పొదుపు చేస్తే రూ.48 లక్షలు మీ సొంతం..!

LIC Policy: భవిష్యత్తు గురించి ముందుగానే ప్లాన్ చేసుకునే వ్యక్తిని తెలివైన వ్యక్తి అంటారు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ ఊహించలేరు. అందుకే డబ్బులు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో చాలా ఎంపికలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఈ రోజు ఎల్‌ఐసీ అందించే ఒక స్కీమ్‌ గురించి తెలుసుకుందాం.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రభుత్వం తరపున ఈ కొత్త ఎండోమెంట్‌ పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీలో తక్కువ పెట్టుబడితో పెద్ద రాబడిని పొందవచ్చు. రోజు రూ. 70 పెట్టుబడి పెట్టడం వల్ల మెచ్యూరిటీ సమయంలో రూ. 48 లక్షలు పొందవచ్చు. ఈ ప్లాన్‌ తీసుకోవడం వల్ల పిల్లల చదువులు, రుణాల చెల్లింపు, భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవచ్చు. దీంతో పాటు బీమా రక్షణ, ఇతర పన్ను సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి.

ఎల్‌ఐసీ ప్రకారం 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ వ్యవధి గురించి మాట్లాడినట్లయితే 12 నుంచి 35 సంవత్సరాలు. ఇందులో కనీస హామీ మొత్తం రూ. 1 లక్ష. గరిష్టంగా ఎటువంటి పరిమితి లేదు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి ఈ ప్లాన్‌ను తీసుకుంటే అతను రోజుకు సుమారు రూ. 70 అంటే సంవత్సరానికి రూ. 26,534 పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం వల్ల అతనికి రూ.10 లక్షల బీమా హామీ లభిస్తుంది. రెండో సంవత్సరంలో ఈ ప్రీమియం 25962కి తగ్గుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీపై రూ. 48 లక్షలు లభిస్తాయి.

Tags:    

Similar News