LIC: పేదల కోసం ఎల్‌ఐసీ సూపర్‌ పాలసీ.. చిన్న పెట్టుబడి పెద్ద రాబడి..!

LIC: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా పాలసీ. దీనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది పాలసీదారులు ఉన్నారు.

Update: 2022-08-03 15:00 GMT

LIC: పేదల కోసం ఎల్‌ఐసీ సూపర్‌ పాలసీ.. చిన్న పెట్టుబడి పెద్ద రాబడి..!

LIC: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా పాలసీ. దీనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది పాలసీదారులు ఉన్నారు. ఒక వ్యక్తి మంచి పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే ఎల్‌ఐసీ బెస్ట్‌ అని చెప్పవచ్చు. అలాగే ఎల్‌ఐసీ పేదల కోసం ఒక పాలసీని రూపొందించింది. ఈ పథకంలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని పొందవచ్చు. దీంతో పాటు ప్రమాదవశాత్తు ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది. మీరు కూడా చిన్న పెట్టుబడిలో పెద్ద రాబడిని పొందాలనుకుంటే ఎల్‌ఐసీ న్యూ జీవన్ మంగళ్ పాలసీలో పెట్టుబడి పెట్టాల్సిందే. ఈ పాలసీ వివరాలు, అర్హతల గురించి తెలుసుకుందాం.

పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు ఉండాలి. పాలసీ మెచ్యూరిటీ 65 సంవత్సరాల వయస్సులో ఉంటుంది. ఈ పాలసీలో మీరు కనిష్టంగా రూ. 10,000, గరిష్టంగా రూ. 50,000 హామీ మొత్తాన్ని పొందుతారు. డెత్ బెనిఫిట్‌ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఖాతాదారుడు ఆకస్మికంగా మరణిస్తే కుటుంబ సభ్యులు మరణ ప్రయోజనం పొందుతారు.

ఖాతాదారుడు ఆకస్మికంగా మరణించిన సందర్భంలో కుటుంబం చెల్లించిన ప్రీమియంలో 7 రెట్లు లేదా 105 శాతం వరకు చెల్లిస్తారు. మరోవైపు ఖాతాదారుడు ఒకే ప్రీమియం పాలసీని ఎంచుకున్నట్లయితే అతని మరణం తర్వాత రిటర్న్‌లో 125 శాతం వరకు ప్రీమియం లభిస్తుంది. మీరు రూ.20 వేలు బీమా హామీ పాలసీని తీసుకుంటే వార్షిక ప్రీమియంగా రూ.1,191 చెల్లించాలి. ఈ పాలసీలో మీరు సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ప్రయోజనం పొందుతారు.

Tags:    

Similar News