LIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!

LIC Jeevan Lakshya: ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2022-08-11 14:30 GMT

LIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!

LIC Jeevan Lakshya: ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇది అన్ని వర్గాల వారికి పాలసీలని రూపొందిస్తుంది. ఈ రోజు జీవన్ లక్ష్య పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది ఎల్‌ఐసీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లలో ఒకటి. మీకు భవిష్యత్తులో ఏదైనా పెద్ద వ్యయం అవసరమైతే ఈ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీ కస్టమర్‌కు రక్షణతో పాటు పొదుపును అందిస్తుంది. జీవన్ లక్ష్య అనేది పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాన్. దీని కింద సబ్‌స్క్రైబర్ పాలసీ వ్యవధి కంటే 3 సంవత్సరాలు తక్కువ ప్రీమియంలను చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

ఎల్‌ఐసీ జీవన్ లక్ష్య పాలసీ అనేది 'విత్ ప్రాఫిట్ పాలసీ', దీనిలో ఎల్‌ఐసీ తన వ్యాపారం లాభాలను వినియోగదారులతో షేర్‌ చేసుకుంటుంది. వెస్టెడ్ సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ రూపంలో కస్టమర్‌లకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అతిపెద్ద లక్షణం ఏంటంటే పాలసీ చేసిన వ్యక్తి ప్రపంచాన్ని విడిచిపెట్టినట్లయితే నామినీకి సంబంధించిన అన్ని ప్రీమియంలు మాఫీ అవుతాయి. హామీ మొత్తంలో 10 శాతం నామినీకి సాధారణ వార్షిక ఆదాయంగా చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో సేకరించిన డబ్బు కూడా అందిస్తారు. అందుకే ఈ పాలసీని కన్యాదాన్ పాలసీ అని కూడా పిలుస్తారు.

30 ఏళ్ల కిరణ్‌ 5 లక్షల జీవన్ లక్ష్య పాలసీని తీసుకున్నాడని అనుకుందాం. కిరణ్‌ 25 ఏళ్లను పాలసీ పీరియడ్‌ ఎంచుకున్నాడు. కిరణ్‌ కేవలం 22 ఏళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. కిరణ్‌ నెలవారీ ప్రీమియం రూ. 1770 అంటే దాదాపు ప్రతిరోజు రూ. 60 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్షిక ప్రీమియం రూ.20,787 అవుతుంది. ఈ విధంగా మొత్తం పాలసీ సమయంలో కిరణ్‌ రూ.4,57,772 డిపాజిట్ చేస్తాడు. పాలసీ 25 సంవత్సరాలకు చేరుకున్నప్పుడు మెచ్యూర్ అవుతుంది. కిరణ్‌కి సమ్ అష్యూర్డ్, రివర్షనరీ బోనస్, అదనపు బోనస్ చెల్లిస్తారు.

ఈ విధంగా కిరణ్‌ 5 లక్షల సమ్ అష్యూర్డ్ 6.125 లక్షల వెస్టెడ్ రివర్షనరీ బోనస్, రూ. 2.25 లక్షల అదనపు బోనస్‌లను పొందుతాడు. పూర్తి మొత్తాన్ని కలిపితే వరుణ్ చేతిలో మెచ్యూరిటీగా రూ.13,37,500 పొందుతాడు. కిరణ్‌ ప్రతిరోజూ దాదాపు రూ. 60 డిపాజిట్ చేయడం ద్వారా దాదాపు రూ. 4.5 లక్షలను పొదుపు చేశాడు. కానీ మెచ్యూరిటీకి వచ్చేసరికి రూ. 13.37 లక్షలు వచ్చాయి. ఇది డిపాజిట్ చేసిన డబ్బు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పాలసీ ఎల్‌ఐసీలోనే బెస్ట్‌ పాలసీగా చెబుతున్నారు.

Tags:    

Similar News