LIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2022-08-19 10:30 GMT

LIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఎల్ఐసీ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటున్నాయి. ఎల్ఐసీ అన్ని వర్గాల వారికి పాలసీలని రూపొందిస్తుంది. సామాన్యులు చాలామంది ఎల్ఐసీ ద్వారా చాలా డబ్బులు పొదుపు చేస్తారు. ఇందులో పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఉంటాయి. ఎల్ఐసీ పాలసీలలో అత్యంత పేరు సంపాదించిన స్కీం జీవన్ లాభ్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

జీవన్ లాభ్ పాలసీ ప్రవేశ వయస్సు 8 సంవత్సరాలు గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. 16 సంవత్సరాల పాలసీ వ్యవధికి 59 సంవత్సరాల వరకు ఉండవచ్చు. 21 , 25 సంవత్సరాల పాలసీ నిబంధనలకు గరిష్ట ప్రవేశం వరుసగా 50,54 సంవత్సరాలకు పరిమితం చేశారు. కనిష్ట హామీ మొత్తం 2 లక్షలు ఉంటుంది. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75. ఈ పాలసీ ప్రమాదవశాత్తు మరణం, వైకల్య ప్రయోజన రైడర్, కొత్త టర్మ్ అస్యూరెన్స్ రైడర్, కొత్త క్రిటికల్ ఇల్నల్ బెనిఫిట్ రైడర్, ప్రీమియం మినహాయింపు బెనిఫిట్ రైడర్, మెచ్యూరిటీ బెనిఫిట్ కోసం సెటిల్మెంట్ ఆప్షన్‌ను కల్పిస్తోంది.

పాలసీదారుడు నెలకి కనీసం రూ.5,000 వాయిదాలో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. వరుసగా రూ.15,000, 25,000 లేదా 50,000 కనీస చెల్లింపుతో ప్రీమియంలు అందుబాటులో ఉన్నాయి, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే అన్ని ప్రీమియంలను సకాలంలో చెల్లించినట్లయితే ప్రాథమిక బీమా మొత్తం సాధారణ రివర్షనరీ బోనస్‌లు, చివరి అదనపు బోనస్‌లు ఒకేసారి చెల్లిస్తారు. పొదుపు చేయడానికి ఈ పథంక ఉత్తమమైనదని చెప్పవచ్చు.

Tags:    

Similar News