LIC: ఎల్‌ఐసీ ప్రత్యేక పథకం.. పొదుపు, భద్రత రెండు ప్రయోజనాలు..!

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇండియాలోనే అతి పెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2022-08-24 13:45 GMT

LIC: ఎల్‌ఐసీ ప్రత్యేక పథకం.. పొదుపు, భద్రత రెండు ప్రయోజనాలు..!

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇండియాలోనే అతి పెద్ద జీవిత బీమా సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులు ఉన్నారు. భారతదేశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక ప్రైవేట్ బీమా కంపెనీలు వచ్చాయి. కానీ నేటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు ఎల్‌ఐసిలో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజు పొదుపు, రక్షణను అందించే ఎల్‌ఐసీ పాలసీ గురించి తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ బచత్‌ ప్లస్ ప్లాన్

ఎల్‌ఐసీ బచాట్ ప్లస్ ప్లాన్ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, సేవింగ్ ప్లాన్. ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతో పాటు పాలసీదారు జీవించి ఉంటే అతను మెచ్యూరిటీపై ఏకమొత్తంలో డబ్బును పొందుతాడు. ఈ పాలసీలో మీకు రెండు పెట్టుబడి ఎంపికలు కనిపిస్తాయి. ఒకటి ఏకమొత్తం ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు లేదా 5 సంవత్సరాల కాలానికి ప్రీమియం మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.

మీరు ఈ పథకంలో చేరాలంటే 90 రోజుల నుంచి 40 సంవత్సరాల వయస్సు వరకు చేరవచ్చు. మీరు ఇందులో కనిష్టంగా రూ.1 లక్ష, గరిష్టంగా రూ. 9 లక్షల హామీ మొత్తం లభిస్తుంది. మరోవైపు మీరు 5 ప్రీమియం పెట్టుబడి ఎంపికను ఎంచుకుంటే గరిష్ట హామీ మొత్తంపై మీకు ఎలాంటి పరిమితి ఉండదు. దీంతో పాటు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రుణ సౌకర్యం పొందుతారు. సింగిల్ ప్రీమియం ఎంపికలో మూడు నెలల తర్వాత రుణం తీసుకోవచ్చు. మరోవైపు బహుళ ప్రీమియం ఎంపికలో కనీసం 2 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. తర్వాత మాత్రమే లోన్ సౌకర్యం పొందుతారు.

Tags:    

Similar News