PM Kisan: పీఎం కిసాన్‌తో పాటు రైతులకి మరో పెద్ద ప్రయోజనం..!

PM Kisan Beneficiaries: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత డబ్బులని పీఎం నరేంద్రమోడీ మే 31న విడుదల చేశారు.

Update: 2022-06-10 07:31 GMT

PM Kisan: పీఎం కిసాన్‌తో పాటు రైతులకి మరో పెద్ద ప్రయోజనం..!

PM Kisan Beneficiaries: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత డబ్బులని పీఎం నరేంద్రమోడీ మే 31న విడుదల చేశారు. 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలలో 2000 రూపాయలు బదిలీ చేశారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఇవ్వాల్సిన వాయిదా ఈసారి మే 31న ఖాతాల్లోకి బదిలీ అయింది. అయితే పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద ప్రయోజనాన్ని కల్పిస్తోంది. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం 'రైతు భాగస్వామ్యం ప్రాధాన్యత హమారీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమం కింద పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులందరికీ 'కిసాన్ క్రెడిట్ కార్డ్' (KCC) అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ) లేని రైతుల దరఖాస్తులను సిద్ధం చేసి ఆయా బ్యాంకు శాఖలకు పంపుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులెవరైనా 'కిసాన్ క్రెడిట్ కార్డ్'ని కలిగి ఉండకపోతే అతను బ్యాంకును సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎంచుకున్న పేపర్లతో పాటు డిక్లరేషన్ అందివ్వాలి.

ఒక పేజీ దరఖాస్తు ఫారమ్‌లో భూమికి సంబంధించిన పత్రాలు, పంట సమాచారం, లబ్దిదారునికి ఏ బ్యాంకు నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) సౌకర్యం లేదని డిక్లరేషన్ ఉంటుంది. రైతులందరికీ క్రెడిట్ కార్డు ప్రయోజనం కల్పించడమే ప్రభుత్వ పథకం ఉద్దేశం. పీఎం కిసాన్ నిధి ప్రతి లబ్ధిదారుడు e-KYCని కలిగి ఉండటం అవసరం. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి e-KYC ప్రారంభించింది. దీనికి ముందుగా మే 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పుడు దానిని జూలై 31 వరకు పొడిగించారు.

Tags:    

Similar News