ఆడపిల్లల పెళ్లి, చదువులకి భరోసా.. రోజు రూ.250 పొదుపుతో 65 లక్షలు మీవే..!

SSY Benefits: ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్త కొత్త పథకాలని రూపొందిస్తూ ఉంటుంది.

Update: 2023-03-15 06:18 GMT

ఆడపిల్లల పెళ్లి, చదువులకి భరోసా.. రోజు రూ.250 పొదుపుతో 65 లక్షలు మీవే..!

SSY Benefits: ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్త కొత్త పథకాలని రూపొందిస్తూ ఉంటుంది. ఇలాంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఇంకా మీరు అద్భుతమైన రాబడిని పొందుతారు. కూతురి చదువులు, పెళ్లిళ్ల ఆందోళన నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అద్భుతమైన పథకం సుకన్య సమృద్ది యోజన. ఈ పథకంలో మీరు కేవలం 250 రూపాయల పెట్టుబడిపై 65 లక్షల రూపాయలు పొందుతారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వం పథకం. ఇందులో తక్కువ మొత్తంతో ఖాతా తెరవవచ్చు. మీ కుమార్తె పేరు మీద కొద్దికొద్దిగా డబ్బు జమ చేయవచ్చు. ఈ పథకంలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల ఖాతాను వారి తల్లిదండ్రులు తెరవవచ్చు. కేవలం రూ.250 పెట్టుబడితో పొదుపు ప్రారంభించవచ్చు. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఇందులో మీకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఇంటిలో కేవలం ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే అర్హులు అవుతారు.

ఎంత వడ్డీ అందుతుంది..

సుకన్య సమృద్ధి యోజనపై పొందే వడ్డీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందులో మీకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తెకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే మీరు ఖాతా నుంచి డబ్బును తీసుకోవచ్చు. ఆదాయపు పన్నులో మినహాయింపు కూడా లభిస్తుంది.

65 లక్షల రూపాయలు

మీరు ఈ స్కీమ్‌లో రోజూ 250 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక నెలలో 12,500 రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఇలా మొత్తం మీరు 22.50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల తర్వాత అంటే మీ కుమార్తె 21 సంవత్సరాల వయస్సులో 65 లక్షల రూపాయలు అందుతాయి. ఇందులో మీకు దాదాపు రూ.41.15 లక్షల వడ్డీ లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కోసం అవసరమైన పత్రాలు

1. తల్లి, తండ్రుల గుర్తింపు కార్డు

2. కుమార్తె ఆధార్ కార్డ్

3. కుమార్తె పేరిట తెరిచిన బ్యాంక్ ఖాతా పాస్‌బుక్

4. కుమార్తె పాస్‌పోర్ట్ సైజు ఫోటో

5. మొబైల్ నంబర్ 

Tags:    

Similar News