రాత్రికి రాత్రి బిలియనీర్ల సంపద ఆవిరి.. అమెరికా మార్కెట్లను కుదిపేసిన ద్రవ్యోల్బణం

Stock Market: అమెరికాకు చెందిన సంపన్న బిలియనీర్ల సంపద రాత్రికి రాత్రే ఆవిరయ్యింది.

Update: 2022-09-14 13:17 GMT

రాత్రికి రాత్రి బిలియనీర్ల సంపద ఆవిరి.. అమెరికా మార్కెట్లను కుదిపేసిన ద్రవ్యోల్బణం

Stock Market: అమెరికాకు చెందిన సంపన్న బిలియనీర్ల సంపద రాత్రికి రాత్రే ఆవిరయ్యింది. ఏకంగా 9వేల 300 కోట్ల డాలర్లను సంపదను కోల్పోయారు. మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు ఏడున్నర లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అనుమానాలు అమెరికా స్టాక్‌ మార్కెట్లను కుదిపేశాయి. వరుసగా తొమ్మిదో రోజు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడంతో బుల్‌ బేర్‌మన్నది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన అమెజాన్‌ ఫౌండర్ జెఫ్‌ బేజోస్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్‌, మెటా సంస్థ అధినేత మార్క్‌ జూకర్‌ బర్గ్‌తో పాటు పలువురు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. రాత్రి రాత్రే వేల కోట్ల సంపదన పోగొట్టుకున్నారు.

స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడంతో అమెజాన్‌ ఫౌండర్ జెఫ్‌ బేజోస్‌కు 980 కోట్ల డాలర్లు, టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్‌కు 840 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జూకర్‌ బర్గ్‌తో పాటు సంపన్నులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, స్టీవ్ బాల్మెర్‌కు చెందిన సంపదన మొత్తం 400 కోట్ల డాలర్లకు పైగా ఆవిరయ్యింది. అమెరికా వ్యాపారవేత్త వారెన్ బఫెట్ 340 కోట్ల డాలర్లను, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ 280 కోట్ల డాలర్ల సంపదను కోల్పోయారు. అయితే మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా నష్టాలు వాటిల్లుతాయని ముందే వ్యాపారవేత్తలు ఊహించినా ఈ స్థాయిలో సంపదనకోల్పోతామని అంచనా వేయలేకపోయారు.

తాజాగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా పెంచింది. తాజాగా పెడరల్‌ బ్యాంక్‌ చీఫ్‌ జెరోమ్‌ పావెల్‌ 8 నిమిషాల ప్రసంగంతోనే మార్కెట్లు కుప్పకూలాయి. ఇదే కాదు అమెరికాలో సంక్షోభం వస్తుందన్న భయం ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలతో భారీ నష్టాలతో ముగిశాయి. తాజా మార్కెట్ల క్రుంగుబాటుతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 500 మంది ధనవంతులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. 



 


Tags:    

Similar News