Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఆర్‌బీఐ కీలక సూచన: సెప్టెంబర్ 30నాటికి రీ-కేవైసీ పూర్తిచేయాలి

Jan Dhan Account: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరూ సెప్టెంబర్ 30లోగా రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా సూచించింది.

Update: 2025-08-06 07:30 GMT

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు ఆర్‌బీఐ కీలక సూచన: సెప్టెంబర్ 30నాటికి రీ-కేవైసీ పూర్తిచేయాలి

Jan Dhan Account: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరూ సెప్టెంబర్ 30లోగా రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా సూచించింది. ఖాతాదారులకు సౌలభ్యం కల్పించేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వివరాలు వెల్లడించారు. పీఎంజేడీవై పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్టు తెలిపారు. యాంటీ మనీ లాండరింగ్ నిబంధనల ప్రకారం, ప్రతి 10 ఏళ్లకోసారి కస్టమర్ వివరాలను ధృవీకరించడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.

గడువు మిస్సైతే లావాదేవీలపై ప్రభావం

ఈ ఏడాది భారీ సంఖ్యలో ఖాతాదారులకు కేవైసీ గడువు ముగియనుండటంతో, గడువు లోపల రీ-కేవైసీ పూర్తిచేయని ఖాతాలపై లావాదేవీల పరిమితులు విధించే అవకాశం ఉందని ఆర్‌బీఐ హెచ్చరించింది. కొన్నిపరిస్థితుల్లో ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశమూ ఉంది.

లక్ష గ్రామ పంచాయతీల్లో క్యాంపులు

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు లక్ష గ్రామ పంచాయతీల్లో బ్యాంకులు రీ-కేవైసీ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ శిబిరాల్లో కేవైసీ సేవలతో పాటు, కొత్త ఖాతాల ప్రారంభం, సూక్ష్మ బీమా, పెన్షన్ పథకాల నమోదు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

55 కోట్ల ఖాతాలు... గొప్ప విజయంగా జన్ ధన్

2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన జన్ ధన్ పథకం ద్వారా ఇప్పటివరకు 55 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. ఈ పథకం వల్ల కోట్లాది మంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించగలిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిరంతరాయంగా అందేందుకు, బ్యాంకింగ్ సేవలలో ఆటంకం కలగకుండా చూసేందుకు ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News