Iran Currency: కుదేలైన ఇరాన్ కరెన్సీ.. ఒక డాలర్ విలువ రూ. 15 లక్షల రియాల్స్.. సంక్షోభంలో ఆయిల్ దేశం!
Iran Currency: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. అంతర్జాతీయ ఆంక్షలు, నిరసనల నడుమ ఇరాన్ కరెన్సీ 'రియాల్' విలువ పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 15 లక్షల రియాల్స్‌కు చేరడంతో సామాన్యుల బతుకు ఛిద్రమవుతోంది.
Iran Currency: కుదేలైన ఇరాన్ కరెన్సీ.. ఒక డాలర్ విలువ రూ. 15 లక్షల రియాల్స్.. సంక్షోభంలో ఆయిల్ దేశం!
Iran Currency: అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, దేశంలో కొనసాగుతున్న అంతర్గత ఆంక్షల దెబ్బకు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇరాన్ కరెన్సీ 'రియాల్' (Iranian Rial) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక యూఎస్ డాలర్ విలువ ఏకంగా 15 లక్షల రియాల్స్‌కు చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గతం కంటే దారుణంగా.. 2015లో అణు ఒప్పందం సమయంలో ఒక డాలర్ విలువ కేవలం 32 వేల రియాల్స్‌గా ఉండేది. కానీ, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మళ్లీ బాధ్యతలు చేపట్టడం, 'గరిష్ట ఒత్తిడి' (Maximum Pressure) విధానాన్ని అమలు చేయడంతో రియాల్ విలువ ఊహకందని రీతిలో పతనమైంది. కేవలం గత ఒక్క ఏడాదే ఈ కరెన్సీ తన విలువలో దాదాపు 45% కోల్పోవడం గమనార్హం.
నిరసన జ్వాలలు: కరెన్సీ పతనం వల్ల ఇరాన్‌లో నిత్యావసర వస్తువులు, మందుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, భద్రతా దళాల కాల్పుల్లో వేల సంఖ్యలో పౌరులు మరణించినట్లు తెలుస్తోంది.
రోజుకు 7 డాలర్ల సాయం.. కానీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు నెలకు 7 డాలర్ల చొప్పున నగదు సాయం ప్రకటించినప్పటికీ, అది ఏ మూలకు సరిపోవడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, ప్రభుత్వ అసమర్థ నిర్వహణే ఈ స్థితికి కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.