Investment: ఈ స్కీంలో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలలో కోటి రూపాయలు మీవే..!

Investment: చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలని కోరుకుంటారు.

Update: 2022-08-03 04:30 GMT

Investment: ఈ స్కీంలో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలలో కోటి రూపాయలు మీవే..!

Investment: చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలని కోరుకుంటారు. దీనికి చక్కటి ఉదాహరణ మ్యూచ్‌వల్ ఫండ్స్‌ అని చెప్పవచ్చు. ఇందులో చిన్న పొదుపు నుంచి పెద్ద రాబడిని పొందవచ్చు. ప్రతి నెలా చిన్న పొదుపులని పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో మీరు లక్షల రూపాయల కార్పస్‌ను సృష్టించవచ్చు.

చాలా కాలం పాటు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP)ని కొనసాగించడం ద్వారా పెట్టుబడిదారులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఇందులో పెట్టుబడిదారుడు తన ఆర్థిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పథకం పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో రిటైల్ ఇన్వెస్టర్లకు క్రమబద్ధమైన పెట్టుబడి మంచిదని నిపుణులు చెబుతున్నారు. SIP కాలిక్యులేటర్ ప్రకారం మీరు 10 సంవత్సరాలలో 1 కోటి కార్పస్‌ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మీరు నెలకి రూ. 40,000 SIP చేయాల్సి ఉంటుంది.

చాలా ఫండ్స్ 10 సంవత్సరాల కాలంలో సగటు వార్షిక రాబడిని 14 శాతం ఇచ్చాయి. ఈ విధంగా 40 వేల నెలవారీ SIPలు 10 సంవత్సరాలలో 14 శాతం సగటు రాబడితో 1 కోటి ఫండ్‌ను సృష్టించగలవు. ఇందులో మీకు రూ. 48 లక్షల పెట్టుబడి, రూ. 56.8 లక్షల లాభం ఉంటుందని అంచనా. అయితే వార్షిక సగటు రాబడి 12 శాతం అయితే మీ కార్పస్ దాదాపు రూ. 93 కోట్లు అవుతుంది.

Tags:    

Similar News