రిటైర్మెంట్ తర్వాత ఈ ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్‌ చేయండి.. బంపర్ లాభాలు పొందండి..!

Retirement Plans: మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పని కచ్చితంగా చేయాలి.

Update: 2022-11-24 04:11 GMT

రిటైర్మెంట్ తర్వాత ఈ ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్‌ చేయండి.. బంపర్ లాభాలు పొందండి..!

Retirement Plans: మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పని కచ్చితంగా చేయాలి. రిటైర్మెంట్‌ తర్వాత జీవితం హాయిగా కొనసాగాలంటే కచ్చితంగా రిటైర్మెంట్‌ ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించాలి. రిటైర్మెంట్‌ తర్వాత ఈ ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెడితే భద్రతతో పాటు మంచి లాభాలు కూడా వస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

మీరు రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింపుల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీలో 60 ఏళ్లు కాదు ఏకంగా 40 ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. మీరు జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్యం సమయంలో పాలసీ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పాలసీని సరెండర్ చేసినప్పుడు 95% తిరిగి వస్తుంది. ఇది కాకుండా ఈ పథకంపై రుణం కూడా తీసుకోవచ్చు.

జాతీయ పెన్షన్ పథకం

మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే జాతీయ పెన్షన్ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం చాలా సురక్షితమైనది కూడా. ఈ పథకంలో మీకు స్థిరమైన పెన్షన్ లభిస్తుంది. 3 సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రీమియం చెల్లించిన తర్వాత దాని నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీకి ముందు మొత్తం డిపాజిట్ మొత్తంలో 25% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజన

అటల్ పెన్షన్ యోజన కింద 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెలా 1000 నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ లభిస్తుంది. ఇందులో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వ్యక్తి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం చందాదారుల సహకారంలో 50 శాతం లేదా ప్రతి సంవత్సరం రూ. 1000, ఏది తక్కువైతే అది జమ చేస్తుంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన

మీరు సురక్షితమైన ప్రదేశంలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రధాన మంత్రి వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత నెలవారీ పెన్షన్ కావాలనుకుంటే ఈ పథకంలో 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ లభిస్తుంది. మీరు రూ. 15 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే, 8% చొప్పున వడ్డీ ఏడాదికి రూ. 1.20 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ మొత్తాన్ని నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా పొందుతారు.

Tags:    

Similar News