Indian Railways: భారతదేశపు మొట్టమొదటి ఏసీ రైలు ఎలా ఉండేదో తెలుసా? చల్లదనం కోసం ఏం వాడేవారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..!
India First AC Train: అయితే భారతదేశంలో మొదటి AC కోచ్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ నుంచి ఎక్కడికి నడిచిందో మీకు తెలుసా?
Indian Railways: భారతదేశపు మొట్టమొదటి ఏసీ రైలు ఎలా ఉండేదో తెలుసా? చల్లదనం కోసం ఏం వాడేవారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..!
Frontier Mail: భారతీయ రైల్వేలు ప్రస్తుతం జనరల్ కోచ్‌లతో పాటు ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్‌లతో రైళ్లను నడుపుతున్నాయి. ప్రజలు తమ సౌలభ్యం ప్రకారం ఈ కోచ్‌లలో టిక్కెట్లు బుక్ చేసుకోవడం ద్వారా సులభంగా ప్రయాణించవచ్చు. అయితే భారతదేశంలో మొదటి AC కోచ్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ నుంచి ఎక్కడికి నడిచిందో మీకు తెలుసా? అందులో ఎలాంటి ఏసీ ఉండేదో మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం, భారతీయ రైల్వేలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడ్‌తో దేశంలోని ప్రతి రూట్‌లో దీన్ని నడపాలని యోచిస్తోంది. ఇది ఎనిమిది కోచ్‌లతో నడుస్తోంది. అన్నింటికీ AC సౌకర్యాలు ఉన్నాయి. అయితే విభజనకు ముందు 1934లో మొదటి AC రైలు లో ప్రవేశపెట్టారు.
ఏసీ కోసం బదులు ఐస్ క్యూబ్‌ల వాడకం..
అప్పట్లో రైళ్లను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లుగా విభజించారు. ఫస్ట్ క్లాస్‌లో బ్రిటీష్ వారికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉండేది. ఈ కారణంగా చల్లగా ఉండేందుకు ఏసీ బోగీగా మార్చారు. బ్రిటీష్ వారు తమ సౌలభ్యం కోసం ఈ వ్యవస్థను తయారు చేశారు. ఇందులో ఏసీకి బదులుగా ఐస్ బ్లాక్‌లను ఉపయోగించారు. వీటిని రైల్ ప్లోర్‌లోనే ఉంచేవారంట.
ఈ రైలు పేరు ఏంటంటే?
రైలు 1 సెప్టెంబరు 1928న ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా పెషావర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)కి బయలుదేరింది. అయితే మార్చి 1930లో సహరాన్‌పూర్, అంబాలా, అమృత్‌సర్, లాహోర్‌లకు మళ్లించారు. ఇందులో ముందుగా ఐస్ బ్లాక్స్‌తో బోగీని చల్లగా ఉంచేవారు. ఆ తర్వాత దానికి ఏసీ సిస్టమ్‌ను జోడించారు. ఈ రైలు పేరు ఫ్రాంటియర్ మెయిల్. ఇది తరువాత అంటే 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో పనిచేయడం ప్రారంభించింది.
బ్రిటిష్ కాలం నాటి అత్యంత లగ్జరీ రైలు..
ఫ్రాంటియర్ మెయిల్ బ్రిటిష్ కాలంలో అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటిగా పేరుగాంచింది. గతంలో ఆవిరితో 60 కి.మీ.ల వేగంతో నడిచేది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌తో నడుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ రైలు 1,893 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. 35 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. దాని 24 కోచ్‌లలో సుమారు 1,300 మంది ప్రయాణికులను తీసుకువెళుతుంది. టెలిగ్రామ్‌లను తీసుకెళ్లడానికి, తీసుకురావడానికి కూడా దీనిని ఉపయోగించారు. ఈ రైలు వచ్చి దాదాపు 95 ఏళ్లు పూర్తయింది.