India-Pakistan: పాక్‌కు వత్తాసు పలుకుతారా.? ఆ దేశాలపై గట్టి దెబ్బ కొట్టిన ఇండియన్ కంపెనీలు
India-Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ రాజ్యాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి.
India-Pakistan: పాక్‌కు వత్తాసు పలుకుతారా.? ఆ దేశాలపై గట్టి దెబ్బ కొట్టిన ఇండియన్ కంపెనీలు
India-Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ రాజ్యాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఇటీవల పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై తీవ్ర దాడులు నిర్వహించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు పాకిస్థాన్‌కు మద్దతుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచాయి.
ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై స్పందించిన భారత్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ సంస్థలు ఈజీమైట్రిప్ (EaseMyTrip) మరియు కాక్స్ అండ్ కింగ్స్ (Cox & Kings) టర్కీ, అజర్‌బైజాన్‌లకు సంబంధించి తమ సేవలపై ఆంక్షలు విధించాయి.
అత్యవసరం లేకపోతే టూరిస్టులు ఈ రెండు దేశాలకు ప్రయాణించకుండా ఉండాలని సూచిస్తూ ఈజీమైట్రిప్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇక కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ టర్కీ, అజర్‌బైజాన్‌తో పాటు ఉజ్బెకిస్తాన్‌కు సంబంధించిన ప్రయాణ ఆఫర్లు, డీల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అజర్‌బైజాన్ విడుదల చేసిన ప్రకటనలో పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో జరిగిన భారత సైనిక చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, “ఈ దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కుటుంబాలకు మేం సంతాపం తెలియజేస్తున్నాం. అన్ని పక్షాలు సంయమనం పాటించి, దౌత్యపరమైన మార్గాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలి” అని పేర్కొంది.
అలానే టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటన చేస్తూ, “మే 6 రాత్రి జరిగిన దాడి వల్ల సమిష్టి స్థాయిలో యుద్ధ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. పౌర లక్ష్యాలపై దాడులను మేం ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ప్రతికూల పరిణామాలకు దారి తీస్తాయి” అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భారత ట్రావెల్ సంస్థలు తమ బాధ్యతగా, దేశజాతీయతకు మద్దతుగా టర్కీ, అజర్‌బైజాన్‌పై ఆంక్షలు విధించాయి.