Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట
Stock markets: గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు * అందిపుచ్చుకున్న దేశీ స్టాక్ సూచీలు
Representational Image
Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా సెషన్ లో లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ కీలకమైన 50 వేల పాయింట్ల ఎగువకు చేరగా నిఫ్టీ 15 వేల మార్క్ వద్దకు చేరింది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 193.45 పాయింట్లు ఎగసి 50,588 వద్దకు చేరగా. నిఫ్టీ 60 పాయింట్ల మేర లాభంతో 14,989 వద్ద కదలాడుతున్నాయి. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో పాటు కీలక రంగాల్లో షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం భారీ ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు తాజా సెషన్ లో స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి.