Stock Market: నష్టాల బాటన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్లు * తాజా వారం తొలిరోజున నష్టాల బాటన ట్రేడింగ్
Representational Image
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా వారం తొలిరోజున నష్టాల బాటన ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 310 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ 14,700 మార్కు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి. సెన్సెక్స్ 265 పాయింట్లు మేర నష్టంతో 49,586 వద్దకు చేరగా నిఫ్టీ 62 పాయింట్ల మేర కోల్పోయి 14,681 వద్ద కదలాడుతున్నాయి.