Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ తగ్గింపు
Indian Stock Market Crashes: దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1065 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో ముగిసాయి. మదుపర్ల సంపద 9 లక్షల కోట్లకు తగ్గింది.
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ తగ్గింపు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఓ దశలో 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 25,200 దిగువకు చేరింది. తర్వాత కాస్త కోలుకున్నాయి. సూచీలు రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మదుపర్ల సంపద దాదాపు ఒక్క రోజులోనే 9లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 9పాయింట్ 46 లక్షల కోట్లు క్షీణించి 455 పాయింట్ 7లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 83,207 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,010 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 1065 పాయింట్ల నష్టంతో 82,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 25,232 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90పాయింట్ 97గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలను చవి చూశాయి.