Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Equity Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * తాజా వారం మలిరోజున లాభాల శుభారంభం
Representational Image
Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా వారం మలిరోజున ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ప్రకంపనలు లాక్ డౌన్లు ఆర్థికవ్యవస్థపై మరోమారు ఆందోళనలు వెరసి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్లలో అప్రమత్తత వాతావరణం కొనసాగుతోంది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 438 పాయింట్లు ఎగసి 48,388 వద్దకు చేరగా , నిఫ్టీ 151 పాయింట్ల మేర లాభంతో 14,511 వద్ద కదలాడుతున్నాయి.