ఈ కంపెనీలలో 4 రోజుల పని 3 రోజులు సెలవు.. సంతోషంలో ఉద్యోగులు..!

Four Day Working: వారంలో నాలుగు రోజులు పనిచేసి మిగిలిన రోజుల్లో విశ్రాంతి తీసుకునే విధానంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది.

Update: 2022-11-30 10:00 GMT

ఈ కంపెనీలలో 4 రోజుల పని 3 రోజులు సెలవు.. సంతోషంలో ఉద్యోగులు..!

Four Day Working: వారంలో నాలుగు రోజులు పనిచేసి మిగిలిన రోజుల్లో విశ్రాంతి తీసుకునే విధానంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. పనిదినాలు తగ్గించినప్పటికీ ఉద్యోగుల జీతం తగ్గదు. కంపెనీ ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లయితే ఇది ఉద్యోగులకి అతిపెద్ద బహుమతి అవుతుంది. ఆనందంతో గంతులెస్తారు. 100 కంపెనీలు వారంలో మూడు రోజులు సెలవులు ఇచ్చి తమ ఉద్యోగులను సంతోషపెట్టాయి.

ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ సెలవులు ఇచ్చినా ఉద్యోగుల జీతంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ మొత్తం సమాచారాన్ని చదివిన తర్వాత ఈ కంపెనీల పేర్లను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. అయితే ఈ కంపెనీలలో ఏదీ భారతీయులది కాదు. ఈ కంపెనీలన్నీ UKకి చెందినవి. ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అనే రెండు పెద్ద కంపెనీలు వారంలో నాలుగు రోజుల పనిదినాలు ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల్లో విడివిడిగా దాదాపు 450 చొప్పున ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అవిన్ కంపెనీ సీఈవో ఆడమ్ రాస్ మాట్లాడుతూ.. నాలుగు రోజులు పని చేయడం కంపెనీ చరిత్రలోనే తొలిసారి. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఐదు రోజులు కాకుండా నాలుగు రోజులు పనిచేస్తే ఉత్పాదకత మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది. వారానికి నాలుగు రోజులు పని చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీలు సరైనవని ఓ సర్వేలో వెల్లడైంది. దీని వల్ల ఉత్పాదకత పెరిగిందని 88 శాతం కంపెనీలు అంగీకరించాయి. నాలుగు రోజులు పని చేయడం వల్ల ఉత్పాదకతపై ఎలాంటి ప్రభావం పడలేదని సర్వే ఫలితాలు వెల్లడించాయి.

Tags:    

Similar News