Investing Tips: మీ డబ్బు త్వరగా రెట్టింపు కావాలి.. కానీ రిస్క్‌ తక్కువగా ఉండాలా..!

Investing Tips: దేశంలో, ప్రపంచంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. చాలా దేశాల్లో యుద్దాలు కూడా జరుగుతున్నాయి.

Update: 2023-10-21 08:30 GMT

Investing Tips: మీ డబ్బు త్వరగా రెట్టింపు కావాలి.. కానీ రిస్క్‌ తక్కువగా ఉండాలా..!

Investing Tips: దేశంలో, ప్రపంచంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. చాలా దేశాల్లో యుద్దాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆదాయాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయో ఎవ్వరం చెప్పలేం. తక్కువ రిస్క్‌తో వేగంగా డబ్బు సంపాదించాలంటే కొన్ని పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. అందులో మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్‌ అని చెప్పవచ్చు. తక్కువ రిస్క్‌తో లార్జ్ క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇతర ఫండ్స్‌తో పోలిస్తే ఇందులో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది.

తక్కువ సమయంలో మంచి రాబడి

నేటి కాలంలో చిన్న నుంచి పెద్ద పెట్టుబడిదారులు తమ సంపాదనలో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే డబ్బు పరోక్షంగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇందులో FD లేదా RD కంటే ఎక్కువ లాభాలను పొందవచ్చు. లార్జ్ క్యాప్ ఈక్విటీ షేర్లు అలాగే మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో FDతో పోలిస్తే రెట్టింపు రాబడిని పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సగటు రాబడిని 15% ఇస్తాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఐదు మ్యూచువల్ ఫండ్స్‌ ఇటీవల కాలంలో మంచి రాబడులను అందిస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్-క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్-క్యాప్ ఫండ్, క్వాంట్ లార్జ్ అండ్ మిడ్-క్యాప్ ఫండ్, బంధన్ కోర్ ఈక్విటీ ఫండ్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటి గురించి కొంత పరిశోధించి నచ్చితే ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ మార్కెట్‌ రిస్క్‌కి లోబడి ఉంటాయని మరిచిపోవద్దు.

Tags:    

Similar News