Investment Plan: ఈ పద్దతిలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు..!

Investment Plan: ఈ పద్దతిలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు..!

Update: 2022-05-16 07:30 GMT

Investment Plan: ఈ పద్దతిలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు..!

Investment Plan: మీరు సురక్షితమైన పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించాలంటే ఈ విషయం తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సులభంగా రూ.1 కోటి ఫండ్‌ను క్రియేట్‌ చేయవచ్చు. అది ఎలా అంటే '15-15-15' ప్లాన్‌ ప్రకారం పెట్టుబడి పెట్టాలి. అంటే వృద్ధి రేటు, పెట్టుబడి కాలం, నెలవారీ పొదుపు మొత్తం అని అర్థం. దీని ప్రకారం మీరు సంవత్సరానికి 15% రాబడిని కోరుకుంటే 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.15000 ఆదా చేయవచ్చు. దీంతో మీరు సులభంగా కోటీశ్వరులవుతారు.

ఈ నియమం ప్రకారం మీరు ప్రతి నెలా15000 రూపాయలతో 15 సంవత్సరాలలో 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయగలుగుతారు. దీనిపై మీకు రూ.73 లక్షల లాభం లభిస్తుంది. ఈ విధంగా మీ చేతుల్లో కేవలం 15 సంవత్సరాల పెట్టుబడిపై రూ.1 కోటి రూపాయలు ఉంటాయి.15 శాతం వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12 శాతం వృద్ధిని అందిస్తుంది. ఇందుకోసం SIP ద్వారా పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల మీరు చక్రవడ్డీ పొందుతారు. ఇక్కడ SIP అంటే దీర్ఘకాలిక క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక. సాధారణంగా పెట్టుబడి ప్రణాళికను 10, 20 లేదా 30 సంవత్సరాలకు ప్రారంభించవచ్చు.

అయితే ఇలా జరగడానికి మీకు కొంచెం ఓపిక అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎల్లప్పుడూ ప్రయోజనాలను అందిస్తాయని గుర్తుంచుకోండి. ఈ పరిస్థితిలో మీరు చిన్న మొత్తంలో మంచి భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడానికి భయపడితే చిన్నగా ప్రారంభించండి. తక్కువ డబ్బుతో వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. అప్పుడు మాత్రమే మీ లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో ప్రతి నెలా కనీసం రూ.500 డిపాజిట్ చేయడం ద్వారా మీరు మంచి రాబడిని పొందవచ్చు. 

Tags:    

Similar News