ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.50,000.. నేరుగా ఖాతాలో డబ్బులు డిపాజిట్‌..!

Majhi Kanya Bhagyashree Yojana: దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.

Update: 2023-07-20 13:30 GMT

ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.50,000.. నేరుగా ఖాతాలో డబ్బులు డిపాజిట్‌..!

Majhi Kanya Bhagyashree Yojana: దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ గొప్ప పథకాన్ని అమలు చేస్తోంది. దానిపేరు మాఝీ కన్యా భాగ్యశ్రీ యోజన. ఈ పథకం కింద ఆడపిల్ల పుడితే రూ.50,000 అందజేస్తుంది. దేశవ్యాప్తంగా ఆడపిల్లల సంఖ్యను పెంచడమే ఈ పథకం ఉద్దేశం. కుమార్తె ఉన్న వారికి ఈ మొత్తాన్ని అందజేస్తుంది. ఈ స్కీం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2016న మాఝీ కన్యా భాగ్యశ్రీ యోజనను ప్రారంభించింది. ఈ పథకం లబ్ధిదారులలో ఒక్కరు లేదా ఇద్దరు కుమార్తెలు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒక్కరైతే రూ.50వేలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కో కూతురికి రూ.25వేలు అందజేస్తోంది. మూడో ఆడబిడ్డకు మాత్ర ఎటువంటి ఆర్థిక సాయం అందదు. ఈ పథకం కోసం నమోదు చేసుకోవాలంటే లబ్ధిదారు తప్పనిసరిగా మహారాష్ట్రలో శాశ్వత నివాస చిరునామాను కలిగి ఉండాలి.

తల్లీ కూతుళ్ల పేరిట జాయింట్ ఖాతా తెరిచి రూ.లక్ష ప్రమాద బీమాతోపాటు రూ.5 వేల ఓవర్ డ్రాఫ్ట్ అందజేస్తారు. ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టిన ఏడాదిలోపు తల్లిదండ్రులకు రూ.50,000 అందజేస్తారు. ఈ పథకం కోసం నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు, తల్లి లేదా ఆడపిల్లల బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, చిరునామా రుజువు, ఆదాయ రుజువు, ప్రభుత్వ గుర్తింపు కార్డును కలిగి ఉండటం అవసరం. కుమార్తెకు 18 ఏళ్లు నిండినప్పడు ఈ మొత్తం విత్‌ డ్రా చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులై అవివాహిత అయి ఉండాలి.

Tags:    

Similar News