New Income Tax Bill: ఏం మారబోతున్నాయో తెలుసా?
New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
New Income Tax Bill: ఏం మారబోతున్నాయో తెలుసా?
New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1961 ఆదాయ పన్ను చట్టాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ బిల్లు ఆమోదం పొందితే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
కొత్త బిల్లులో ఏం మారనున్నాయి?
ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను బిల్లు 800 పేజీలతో ఉంది. అయితే కొత్త బిల్లు 622 పేజీలకు కుదించారు. పాత బిల్లులోని కొన్ని నిబంధనలు తొలగించనున్నారు. కొత్త బిల్లులో 2.6 లక్షల పదాలున్నాయి. కొత్త చట్టంలో 5.12 లక్షల పదాలున్నాయి. లాభాపేక్ష లేని సంస్థలకు చెందిన అన్ని నిబంధనలను ఒకే అధ్యాయంలో చేర్చారు. రిటర్న్ ఫైలింగ్ లో వేతనాలకు సంబంధించి అన్ని నిబంధనలను ఒక దగ్గరకు చేర్చారు.రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ప్రీవియస్ ఇయర్ , అసెస్ మెంట్ ఇయర్ లను కొత్త బిల్లులో తొలించారు. వీటి స్థానంలో పన్ను ఏడాది మాత్రమే ఉంచారు.80 సీ క్లాజ్ ను 123కి మార్చరు. ఈ సెక్షన్ కింద లక్షన్నర వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది.
మరో వైపు ఆదాయ పన్నులో చాప్టర్ల సంఖ్య 47 నుంచి 23కు తగ్గింది. ఇందులో సెక్షన్లను 819నుంచి 236 కు తగ్గించారు. క్రిఫ్టో కరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ ఆస్తులను అధికారిక ఆస్తులుగా గుర్తించారు. చిన్న వ్యాపారులు తమ ఆదాయంలో నిర్ణీత శాతంపై పన్ను చెల్లించేందుకు అనుమతించే ప్రిన్స్టివ్ ట్యాక్సేషన్ ను కూడా విస్తరించారు. దీని కింద వ్యాపారుల టర్నోవర్ పపరిమితిని 2 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచారు. వృత్తి నిపుణులకు కూడా 50 లక్షల నుంచి 75 లక్షలకు పెంచారు.
మారని నిబంధనలు ఏంటి?
మినహాయింపులకు సంబంధించిన నిబంధనలు, టీడీఎస్, టీసీఎస్ వివరాలను సంక్షిప్తంగా పట్టికల రూపంలో ఇచ్చారు. గత బడ్జెట్ లో ప్రకటించిన ఆదాయ పన్ను శ్లాబులను కొనసాగించనున్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం, పన్నుల చెల్లింపు వంటి అంశాలకు సంబంధించి కూడా ఎలాంటి మార్పులు ఉండవు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో వేర్వేరు చాప్టర్లను పరిశీలించాల్సిన అవసరం లేదు. పన్ను చెల్లింపుదారులకు లభించే హక్కులు, ప్రయోజనాలు రక్షించేలా కొత్త బిల్లులో రద్దులు, పొదుపు నిబంధనలు కూడా పొందుపర్చారు. కోర్టులు తమ ఆదేశాల్లో తెలిపే పదాలు మాత్రం మార్చలేదు.