Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు అందరూ తీసుకోవచ్చు.. నో ఏజ్‌ లిమిట్‌..!

Health Insurance: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి. సంపాదించేవారైతే కచ్చితంగా తీసుకోవాలి.

Update: 2024-04-30 13:30 GMT

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు అందరూ తీసుకోవచ్చు.. నో ఏజ్‌ లిమిట్‌..!

Health Insurance: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి. సంపాదించేవారైతే కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే దైనందిన జీవితంలో ఏరోజు ఏమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైన ఒక్క హెల్త్‌ ఎమర్జెన్సీ వస్తే అప్పటివరకు పొదుపుచేసుకున్న మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు అప్పులు కూడా చేయవలసి వస్తుంది. దీంతో జీవితం ఒక్కసారిగా పేదళ్లు వెనుకకు వెళ్తుంది. అందుకే మీరు ముందుగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే ఇది మీ ఆపద నుంచి గట్టెక్కిస్తుంది.

ఇటీవల ఆరోగ్య బీమాకు సంబంధించి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పులు చేసింది. పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని తొలగించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు కొత్త ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పొందొచ్చు. ఇక అన్ని వయసుల వారికీ బీమా సంస్థలు పాలసీలను జారీ చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి కిలిసివచ్చే అంశం.

ఇక నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు సీనియర్‌ సిటిజన్లు, స్టూడెంట్స్‌, పిల్లలు, గర్భిణులు ఇలా అన్ని వర్గాలవారికి అనుకూలమైన పాలసీలను రూపొందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల హాస్పిటల్‌ ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ మరికొన్ని మార్పులు చేసింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్‌ పీరియడ్‌, మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న వెయిటింగ్‌ పీరియడ్‌ను ఇప్పుడు 3 సంవత్సరాలకు కుదించింది. ఈ నిబంధన వల్ల ఒకవేళ మూడేళ్లు నిరంతరం ప్రీమియం చెల్లిస్తే ముందస్తు వ్యాధులను కారణంగా చూపి క్లెయిమ్‌లను బీమా సంస్థలు తిరస్కరించడానికి వీలుండదు.

Tags:    

Similar News