Indian Railways: రైల్వే ప్లాట్‌ ఫారమ్‌పై పసుపు రంగు చారలని ఎప్పుడైనా గమనించారా.. వీటి అర్థం ఏంటో తెలుసా..?

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

Update: 2022-12-15 10:00 GMT

Indian Railways: రైల్వే ప్లాట్‌ ఫారమ్‌పై పసుపు రంగు చారలని ఎప్పుడైనా గమనించారా.. వీటి అర్థం ఏంటో తెలుసా..?

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలన్నా.. రైల్వేలంటే ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతారు. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతిరోజూ లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. రైల్వే గత కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాల నుంచి అన్ని రంగాలలో మార్పులు చేస్తోంది. అయితే రైల్వే ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని విషయాలను గమనించవచ్చు. కానీ వాటి అర్థం మీకు తెలిసి ఉండకపోవచ్చు.

రైల్వే స్టేషన్ చిన్నదైనా పెద్దదైనా అక్కడి ప్లాట్ ఫాం అంచులపై పసుపు రంగు చారలు గీస్తారు. వీటిని రైల్వే లైన్‌కు సమాంతరంగా వేస్తారు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై పసుపు రంగు టైల్స్‌ను వేస్తారు. అయితే వీటిని ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. ఇది చూసేవారికి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఈ పసుపు చారలను తయారు చేయడం వెనుక ఒక నిజం దాగి ఉంది. దాని గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పసుపు రంగు చారలు చేయడానికి కారణం ప్రయాణీకుల భద్రతకు సంబంధించినది. ప్రజలు రైలు ఎక్కడానికి ట్రాక్‌కు చాలా దగ్గరగా వెళుతారు. కానీ పసుపు చారలు కొంచెం వెనుకక ఉండాలని హెచ్చరిస్తాయి. వీటివల్ల అవాంఛనీయ సంఘటనలను నివారించవచ్చు.

వాస్తవానికి రైలు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నప్పుడు బలమైన గాలి పీడనం ప్రయాణీకులను రైలు వైపుకు లాగుతుంది. కానీ ప్రయాణీకుడు పసుపు గీత వెనుక ఉంటే ఈ ఒత్తిడి ఏమి చేయలేదు. అలాగేదృష్టి లోపం ఉన్నవారు రైలులో ప్రయాణించడానికి వస్తారు. వారికి పసుపు రంగు బాగా కనబడుతుది. దీనివల్ల రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాటిని బట్టి అంచనా వేసుకుంటారు.

Tags:    

Similar News