Employee Rights: కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందా.. రూల్స్ ప్రకారం ఈ బెనిఫిట్స్‌..!

Employee Rights: ఏదైనా ఒక కంపెనీ ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి. సదరు ఉద్యోగికి జీతం లేదా పరిహారం చెల్లించాలి.

Update: 2023-10-19 15:30 GMT

Employee Rights: కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందా.. రూల్స్ ప్రకారం ఈ బెనిఫిట్స్‌..!

Employee Rights: ఏదైనా ఒక కంపెనీ ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి. సదరు ఉద్యోగికి జీతం లేదా పరిహారం చెల్లించాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వ కార్మిక చట్టం ఏం చెబుతోంది. కంపెనీ నిబంధనలు పాటించకపోతే ఉద్యోగికి ఎలాంటి హక్కులు ఉంటాయి. అలాగే కంపెనీకి ఈ విషయంలో ఎలాంటి హక్కులు ఉంటాయి. మొదలైన వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చట్టం ఏం చెబుతోంది?

ప్రైవేట్ కంపెనీకి తన ఉద్యోగులను తొలగించే హక్కు ఉంటుంది. కానీ ఇది భారతీయ కార్మిక చట్టాల ప్రకారమే జరగాలి. ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు నిరంతరాయంగా పని చేస్తుంటే కంపెనీ అతనిని తొలగించినట్లయితే ఆ ఉద్యోగి గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం గ్రాట్యుటీకి అర్హుడు అవుతాడు. అంతేకాకుండా అతను పని చేసినన్ని రోజులకు పూర్తి జీతం పొందుతాడు. ఈ నియమం ఇటీవల చేరిన ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.

నోటీసు వ్యవధి కోసం ప్రతి కంపెనీకి వేర్వేరు నియమాలు ఉంటాయి. మీరు కంపెనీని వదిలిపెట్టినట్లయితే రాజీనామా చేసిన తర్వాత నోటీసు వ్యవధిని అందించాలి. కంపెనీ మిమ్మల్ని తొలగిస్తే నోటీసు వ్యవధిలో బేసిక్‌ వేతనాన్ని చెల్లించాలి. నిబంధన 30 నుంచి 90 రోజుల మధ్య ఉన్నప్పటికీ కంపెనీలు తమ సౌలభ్యం ప్రకారం దీనిని మార్చుకోవచ్చు.

సెలవులకు బదులుగా డబ్బులు

కంపెనీ తొలగించే వ్యక్తికి సెలవులు ఉన్నట్లయితే అతను లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు అర్హుడు అవుతాడు. సెలవులకు బదులుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి కంపెనీ సహాయం అందించాలి. ఇవన్నీ నిబంధనల ప్రకారమే జరగాలి. ముఖ్య విషయం ఏంటంటే ఉద్యోగంలో చేరినప్పుడు కంపెనీ మిమ్మల్ని ఒక ఒప్పందంపై సంతకం చేయించుకుంటుంది. అందులో కొన్ని విషయాలపై మీ నుంచి అనుమతి తీసుకుంటుంది. దాని ప్రకారం కంపెనీ మీతో వ్యవహరిస్తుంది. 

Tags:    

Similar News