SIM Card Rule: ఈ కస్టమర్లు కొత్త సిమ్‌ని కొనలేరు.. ప్రభుత్వం నిబంధనలని మార్చింది..!

SIM Card Rule: మీరు కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Update: 2022-05-23 13:09 GMT

SIM Card Rule: ఈ కస్టమర్లు కొత్త సిమ్‌ని కొనలేరు.. ప్రభుత్వం నిబంధనలని మార్చింది..!

SIM Card Rule: మీరు కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. సిమ్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను మార్చింది. దీని ప్రకారం కొంతమంది కస్టమర్లకు కొత్త సిమ్ పొందడం సులభం అయింది. అయితే కొంతమంది కస్టమర్లకు ఇప్పుడు కొత్త సిమ్‌ను కొనుగోలు చేయలేరు. వాస్తవానికి ఇప్పుడు కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో కొత్త SIM కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SIM కార్డ్ డైరెక్ట్‌గా ఇంటికే వస్తుంది.

సిమ్ నిబంధనలను ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు కొత్త సిమ్‌ విక్రయించలేరు. 18 ఏళ్లు పైబడిన కస్టమర్‌లు ఆధార్‌ కార్డుని ధృవీకరించి కొత్త సిమ్‌ని పొందవచ్చు. కొత్త మొబైల్ కనెక్షన్‌కి UIDAI ఆధార్ ఆధారిత e-KYC సేవ ధృవీకరణ కోసం వినియోగదారులు కేవలం రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది.

టెలికాం శాఖ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సిమ్ కార్డులను విక్రయించదు. ఇది కాకుండా ఒక వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉంటే అలాంటి వ్యక్తికి కొత్త సిమ్ కార్డ్ జారీ చేయదు. అలాంటి వ్యక్తి నిబంధనలను ఉల్లంఘిస్తూ సిమ్‌తో పట్టుబడితే దోషిగా పరిగణిస్తారు. ఇప్పుడు UIDAI ఆధారిత ధృవీకరణ ద్వారా కస్టమర్‌లు ఇంటి వద్ద సిమ్‌ని పొందుతారు.

Tags:    

Similar News