Indian Railways: రైల్వే ఉద్యోగులకి శుభవార్త.. జీతం, ప్రమోషన్ ప్రయోజనాలు..!

Indian Railways: భారతీయ రైల్వేలోని వేలాది మంది ఉద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి.

Update: 2022-11-18 13:28 GMT

Indian Railways: రైల్వే ఉద్యోగులకి శుభవార్త.. జీతం, ప్రమోషన్ ప్రయోజనాలు..!

Indian Railways: భారతీయ రైల్వేలోని వేలాది మంది ఉద్యోగులకు ఇది శుభవార్తని చెప్పాలి. రైల్వేశాఖ కొత్త నిర్ణయంతో దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. ఈ నిబంధన ప్రకారం సూపర్‌వైజరీ కేడర్‌కు గ్రూప్ 'ఎ' అధికారులతో సమానంగా అధిక వేతన స్కేల్‌ను చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీంతో దాదాపు 80 వేల మంది రైల్వే ఉద్యోగులకి లబ్ధి చేకూరుతుంది. దీంతో పాటు ప్రమోషన్‌కు కూడా అవకాశం ఉంటుంది.

దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వేలో లెవల్-7లో ఉన్న సూపర్‌వైజరీ కేడర్‌ల పే స్కేల్‌లో స్తబ్దత ఉందని వారి పదోన్నతికి ఆస్కారం లేదని తెలిపారు. గత 16 ఏళ్లుగా సూపర్‌వైజర్‌ కేడర్‌ వేతనాలు పెంచాలనే డిమాండ్‌ ఉంది. గ్రూప్ 'బి' పరీక్ష పెట్టి ఎంపిక చేయడమే ప్రమోషన్‌కు ఏకైక మార్గం. ఇప్పుడు 50 శాతం ఉద్యోగులను లెవల్ 7 నుంచి లెవల్ 8కి వెళ్లేలా నిబంధనలు రూపొందించామన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్‌లో 50 శాతం మంది ఉద్యోగులకు నాలుగేళ్లలో లెవెల్-8 నుంచి లెవల్-9కి పదోన్నతి కల్పించాలని నిబంధన విధించారు.

స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు వంటి 40,000 మంది సూపర్‌వైజర్ కేటగిరీ ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. పే స్కేల్ పెంపుదల వల్ల ప్రతి ఒక్కరికీ సగటున నెలకు రూ.2,500 నుంచి రూ.4,000 వరకు అదనంగా వేతనం లభిస్తుంది. అంతేకాదు ప్రమోషన్ల విషయంలో కూడా అందరికి సమాన అవకాశాలు లభిస్తాయి.

Tags:    

Similar News