Gold Rates Today: తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి..

బంగారం వెండి ధరలు మంగళవారం కొద్దిగా తగ్గాయి.

Update: 2019-10-01 03:44 GMT

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 155 రూపాయలు తగ్గి ధర 39,305 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గి 36,030 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 225 రూపాయలు తగ్గింది. కేజీ వెండి ధర 48,500 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రెండువేలు దగ్గరగా పెరిగింది. దీంతో 40,145 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 36,800 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజే వెండి ధర 48,500 రూపాయలుగానే ఉంది.



Tags:    

Similar News