నిలకడగా ఉన్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

ఈరోజు (25-11-2019) బంగారం ధరలు ఎటువంటి మార్పులూ లేకుండా స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా అదేవిధంగా నిలకడగా ఉన్నాయి.

Update: 2019-11-25 02:40 GMT
Representational Image

ఈరోజు దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. కాగా..వెండి ధరలు కూడా మార్పులు లేకుండా స్థిరంగా నే ఉన్నాయి. 25.11.2019 సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆదివారం ధరలతో పోలిస్తే ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. మరోవైపు వెండి ధరలు కూడా కదలిక లేకుండా ఉన్నాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,700 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా  36,390 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధరలు కూడా నిలకడగా ఉండడంతో  హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,700 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,390 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా,ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,350 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,150 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర కూడా మార్పులు లేకుండా 46,700 రూపాయల వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25.11.2019 ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News