స్వల్పంగా పెరిగిన బంగారం..మరింత తగ్గిన వెండి!
ఈరోజు (24-11-2019) బంగారం ధరలు అతి స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. అయితే, వెండి ధరలు మాత్రం మరింత తాగాయి.
నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. కాగా..వెండి ధరలు మాత్రం మరి కొంచెం తగ్గాయి. 24.11.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శనివారం ధరలతో పోలిస్తే 20 రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరలు మాత్రం కేజీకి 100 రూపాయల వరకూ దిగివచ్చాయి.
ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,700 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయలు పెరిగి 36,390 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు మరింత తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 46,700 రూపాయలకు దిగివచ్చింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,700 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,390 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా,ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,350 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,150 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 100 రూపాయలు తగ్గింది. దీంతో 46,700 రూపాయలకు పడిపోయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24.11.2019 ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.