Gold Rates: పెరిగిన బంగారం ధరలు..స్థిరంగా వెండి!

gold rates today 24-01-2020. gold rates increased. silver rates stable. gold and rates-hyderabad-delhi-vijayawada-amaravathi

Update: 2020-01-24 02:41 GMT

బంగారం ధరలు దోబూచులాట ఆగలేదు. ప్రతి రోజూ పెరగడం..తగ్గడం.. ఇలా ధరలు స్థిరంగా ఉండడం లేదు.  నిన్న కిందకు దిగి వచ్చిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పైకెగాశాయి. ఈరోజు (24.01.2020) బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. అదే విధంగా నిన్న బంగారం తో పాటు నిన్న కింద చూపులు చూసిన వెండి ధరలు మాత్రం ఈరోజు స్థిరంగా నిలిచాయి.

స్వల్పంగా  పెరిగిన బంగారం..


హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 130 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,480 నుంచి 41,610 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 130 రూపాయలు తగ్గడంతో 38,020 నుంచి 38,150 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధర అక్కడే..


బంగారం ధరలు పై చూపులు చూసినా వెండి ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి. దీంతో వెండి ధరలు  కేజీకి మార్పులు లేకుండా  నిన్నటి ధరల వద్దే ఉన్నాయి. దీంతో కేజీ వెండిధర 49,000 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇలానే..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,610 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,150 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,000 రూపాయల వద్ద స్థిరంగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..


కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కిందికి పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 100 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,150 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల  నమోదు చేసి 38,950 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా మార్పులు లేకుండా నిలిచింది. దాంతో వెండి ధర కేజీకి 49,000 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News