స్థిరంగా బంగారం..మరికొంచెం తగ్గిన వెండి!

నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2019-11-22 02:50 GMT

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. కాగా..వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22.11.2019 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారం ధరలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం కేజీకి 50 రూపాయల వరకూ దిగివచ్చాయి.

శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా ఉంది. దీంతో పది గ్రాముల ధర 39,860 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా నిలిచి  36,540 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 46,850 రూపాయలకు దిగివచ్చింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,860 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,540 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం  38,500 రూపాయల వద్దకు నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 37,300 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గింది. దీంతో 46,850 రూపాయలకు పడిపోయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22.11.2019 శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News