బంగారం మరికొంచెం తక్కువ..వెండి మరింత పైకి

బంగారం ధరలు మరి కొంచెం తగ్గాయి. కాగా..వెండి ధరలు మాత్రం పెరుగాయి. నిన్నటిలానే బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి.

Update: 2019-11-13 01:44 GMT

బంగారం ధరలు మరి కొంచెం తగ్గాయి. కాగా..వెండి ధరలు మాత్రం పెరుగాయి. నిన్నటిలానే బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. 13.11.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం ధరలతో పోలిస్తే పది గ్రాములకు 40 రూపాయల వరకూ తగ్గింది. కాగా, వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,510రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 30 రూపాయలు తగ్గి 36,220 రూపాయలకు చేరింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు పెరిగి 48,750రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,510 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,220 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం స్థిరంగా 38,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 37,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో 48,750రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13.11.2019 బుధవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


Tags:    

Similar News