స్థిరంగా బంగారం ధరలు. వెండి ధరల్లోనూ మార్పులేదు

దేశీయ మార్కెట్లలో ఆదివారంతో పోలేస్తే సోమవారం 11-11-2019 బంగారం, వెండి ధరలు ఎటువంటి మార్పులూ లేకుండా స్థిరంగా ఉన్నాయి.

Update: 2019-11-11 03:01 GMT

రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. 11.11.2019 సోమవారం పది గ్రాముల బంగారం ధర ఆదివారం ధరలతో పోలిస్తే యధాతథంగా ఉన్నాయి. కాగా, వెండి ధరలు కూడా అదేవిధంగా మార్పులు లేకుండా ఉన్నాయి.

సోమవారం  హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగా ఉంది. దీంతో పది గ్రాముల ధర 39,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 36,300 రూపాయల వద్ద ఉంది. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి  48,650 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,600 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,300 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ఎటువంటి మార్పులకూ లోనవలేదు. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,320 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా మార్పులు లేకుండా  37,050 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధర ఇక్కడా యధాతథంగా కేజీకి  48,650 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11.11.2019 సోమవారం  ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

Full View


Tags:    

Similar News