ఈరోజూ తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి!

Update: 2019-12-09 01:47 GMT

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరింత తగ్గాయి.మరోవైపు వెండిధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయలు తగ్గి 39,530 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయలు తగ్గి 36,120 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర మార్పులేకుండా 47,500 వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,530 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,120 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు తగ్గాయి. దీంతో 38,100 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయలు తగ్గడంతో 36,900 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధరలో ఎలాంటి మార్పులేదు. దీంతో వెండి కేజీకి 47,500 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతbుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.

 

 


Tags:    

Similar News