Gold Rate Today: జనవరి 6వ తేదీ బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate Today: జనవరి 6వ తేదీ బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Update: 2026-01-06 02:28 GMT

Gold Rate Today: జనవరి 6వ తేదీ, మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం–వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. నేటి ధరలను గమనిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,40,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,26,350కు చేరింది. వెండి ధర కూడా ఎగసి, ఒక కిలో వెండి రూ.2,44,990 పలుకుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు బంగారం, వెండి రెండూ పెరిగినట్లే కనిపిస్తోంది.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలే నిలుస్తున్నాయి. ముందుగానే అంచనా వేసినట్లుగా వెనుజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యల తర్వాత ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి కొంతమేర బయటకు వచ్చి, సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండివైపు మొగ్గు చూపుతున్నారు. దాని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధర దాదాపు 100 డాలర్ల వరకు పెరిగింది. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 4,449 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

గత నెలలో దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.45 లక్షల స్థాయిలో పలికింది. ఆ గరిష్ట ధరతో పోలిస్తే ప్రస్తుతం బంగారం సుమారు రూ.5 వేల వరకు తక్కువగా ట్రేడవుతోంది. అయితే ఇప్పుడొచ్చిన ఈ పెరుగుదల శాశ్వతంగా కొనసాగకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెనుజులా ఘటనను అమెరికన్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా తీసుకోవడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు.

గత రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్లు బలంగా ముగిశాయి. డో జోన్స్ సూచీ సుమారు 600 పాయింట్ల లాభంతో క్లోజ్ కాగా, నాస్డాక్ సూచీ కూడా దాదాపు 160 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా ఎనర్జీ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభపడ్డాయి. దీనికి కారణం వెనుజులా ఆయిల్ రంగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనలేనని విశ్లేషకులు అంటున్నారు.

వెనుజులాలో ఆయిల్ రంగంలో అమెరికన్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తాయని ట్రంప్ ప్రకటించారు. వెనుజులా చమురు ‘హెవీ ఆయిల్’గా పేరొందింది. ఈ హెవీ ఆయిల్ ద్వారా కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా 20కిపైగా ఇతర ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉంటుంది. అందుకే అమెరికన్ రిఫైనరీ కంపెనీలు ఈ తరహా చమురుపై చాలా కాలంగా ఆసక్తి చూపుతున్నాయి. తాజా పరిణామాలతో వారికి కొత్త అవకాశాలు లభించినట్లుగా మార్కెట్లు భావిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధరలు ఉన్న స్థాయి నుంచి కొంత కరెక్షన్‌కు లోనయ్యే అవకాశమూ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం వస్తే, సేఫ్ హేవన్ డిమాండ్ తగ్గి, బంగారం ధరలు మళ్లీ కొంత తగ్గే అవకాశం ఉందన్నది వారి అంచనా.

Tags:    

Similar News