Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు తులం రేటు ఎంతంటే..?

Gold Rate Today: బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు భయపడిపోతున్నారు.

Update: 2025-02-09 01:33 GMT

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు తులం రేటు ఎంతంటే..?

Gold Rate Today: బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు భయపడిపోతున్నారు. ఇప్పటికే భార‌త్‌లో బంగారం ధ‌ర‌లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఐతే, ప్రస్తుతం బంగారం ధ‌ర‌లు పెరుగుతున్న స్పీడ్‌ను చూస్తుంటే.. రూ.ల‌క్ష ట‌చ్ అవ్వ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టేలా లేదు. సామాన్యులు మాత్రం బంగారం ధరలు తగ్గుతాయేమో అని వేచి చూస్తున్నారు. ఇక ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం కూడా బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది.

బంగారం ధర ప్రస్తుతం 87 వేల రూపాయల ఎగువన పలుకుతుంది. గత ఏడాది కాలంగా గమనించినట్లయితే గత ఫిబ్రవరి నెలతో పోల్చి చూస్తే బంగారం ధర ఒక తులం దాదాపు 23 వేల రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,620 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,050 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 97,738 పలికింది. బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డు సృష్టిస్తూ ముందుకు దూసుకు వెళ్తుంది. 

Tags:    

Similar News