Gold Rate: తగ్గిన బంగారం ధరలు..అదే దారిలో వెండి ధరలు..తాజా ధరలివే!

Gold Rate: బంగారం ధరలు వరుసగా మూడోరోజు తగ్గుదల బాటలోనే నడిచాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

Update: 2021-08-31 02:04 GMT

Representation Photo

Gold Rate: బంగారం ధరలు సోమవారం తగ్గుదల కనబరిచాయి. దీంతో మంగళవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (31.08.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. మంగళవారం (30.08.2021) బంగారం ధరలు సోమవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 110 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 44,450 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 48 వేలరూపాయల మార్క్ వద్ద నిలిచింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 120 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసి 50,230 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు కిందికే..

బంగారం ధరలు కాస్త తగ్గితే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరకంటె భారీగా 300 రూపాయలు తగ్గింది. దీంతో 68 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 68,400 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. మంగళవారం (31.08.2021) బంగారం ధరలు సోమవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 110 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 44,450 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 48 వేలరూపాయల మార్క్ వద్ద నిలిచింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 120 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసి 50,230 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 110 రూపాయలు తగ్గి 46,600 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ 140 రూపాయలు తగ్గి 50,800 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 63 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 63,600 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31-08-2021 ఉదయం 5 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News