Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే?

Update: 2025-02-17 02:18 GMT

Gold Rate Today: మహిళలకు శుభవార్త. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. నిన్న 10 గ్రాములకు రూ. 100 తగ్గిన బంగారం ధర నేడు రూ. 10లు తగ్గింది. అయినా తులం బంగారం ధరరూ. 86వేల మార్క్ దాటడంతో పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. అవసరం ఉంటే తప్ప బంగారం షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదు. కొనాల్సి వచ్చినా ఆలోచించి మరీ కొనుగోలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 79, 040కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధరరూ. 10 తగ్గి రూ. 86,210వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 78, 890దగ్గర ఉంది. మరోవైపు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 86,060 దగ్గర కొనసాగుతోంది. ఇక వెండి ఆదివారంతో పోలిస్తే కిలోకు రూ. 100లు తగ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు :

కోల్‌కతా- రూ.78,890, రూ.86,060

చెన్నై- రూ.78,890, రూ.86,060

బెంగళూరు- రూ.78,890, రూ.86,060

ముంబై- రూ.78,890, రూ.86,060

హైదరాబాద్- రూ.78,890, రూ.86,060

విజయవాడ- రూ.78,890, రూ.86,060

ఢిల్లీ- రూ.79,040, రూ.86,210

భువనేశ్వర్- రూ.78,890, రూ.86,060

Tags:    

Similar News