Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ..తాజా ధరలు ఇవే
Gold Rate Today: బంగారం ధరలు భారీ షాకిస్తున్నాయి. బుధవారం తగ్గినట్లే తగ్గిన బంగారం ధర నేడు గురువారం మళ్లీ పెరిగింది. ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలు దారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో బంగారం ధర తులం రూ. 90వేలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 421 ఉంది. నేడు రూ. 78, 678కి చేరుకుంది. 24క్యారెట్ల తులం బంగారం ధర బుధవారం రూ. 85, 550 ఉండి. ఈ రోజు గురువారం రూ. 85, 830కి చేరింది.
విజయవాడ, విశాఖ, హైదరాబాద్ నగరాల్లో నిన్న 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 678 ఉంది. నేడు రూ. 78, 943కు చేరుకుంది. 24క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 85,830కాగా రూ. 86,120కు చేరుకుంది. ఇక దేశవ్యాపత్ంగా వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఢిల్లీలో బుధవారం కిలో వెండి ధర రూ. 94,040ఉండగా..గురువారానికి రూ. 94,920కి చేరుకుంది. హైదరాబాద్, విశాఖ నగరాల్లో కిలో వెండి ధర నిన్న రూ. 94,350 ఉండగా నేడు రూ. 95,240కి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
పుణె- రూ.78,815, రూ.85,980
భోపాల్- రూ.78,898, రూ.86,070
ముంబై- రూ.78,815, రూ.85,980
భువనేశ్వర్- రూ.78,833, రూ.86,000
కోయంబత్తూర్- రూ.79,044, రూ.86,230
బెంగళూరు- రూ.78,879, రూ.86,050